మోదీని వదిలి వెళ్లిన వారందరికీ పతనం తప్పలేదు: మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్

  • మోదీని వదిలి వెళ్లిన వారిని ప్రజలు క్షమించరు
  • సీట్ల పంపకాల విషయంలో శివసేనతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి
  • ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
ప్రధాని మోదీని వదిలిన వారందరికీ పతనం తప్పలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అన్నారు. నాగ్ పూర్ సమీపంలోని కాటోల్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మోదీని వదిలి వెళ్లిన వారిని ప్రజలు క్షమించరని చెప్పారు. ఇటీవలే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నప్పటికీ... మిత్రపక్షమైన శివసేన లక్ష్యంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టు మరికొందరు చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఒంటరిగా బరిలోకి దిగబోతోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

ఇప్పటికే మిత్రపక్షాలైన బీజేపీ, శివసేనలు కలసికట్టుగా కాకుండా... వేర్వేరుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. 'జన ఆశీర్వాద యాత్ర' పేరుతో శివసేన భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ, సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు. కలసి పోటీ చేస్తే కొన్ని చోట్ల గెలుపు, మరికొన్ని చోట్ల ఓటమిపాలయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
Modi
Fadnavis
Shivsena
BJP
Maharashtra

More Telugu News